టైం రెడీ, ప్లేస్ రెడీ, ఇక ప్రతీకారమే...

ABN , First Publish Date - 2021-03-09T02:33:01+05:30 IST

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌లపై సిరీస్‌ విజయాలు సాధించి సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోకి భారత్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌తో..

టైం రెడీ, ప్లేస్ రెడీ, ఇక ప్రతీకారమే...

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌లపై సిరీస్‌ విజయాలు సాధించి సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోకి భారత్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌తో భారత్ తలపడనుంది. అయితే ఆ మ్యాచ్‌ ఏ వేదికలో నిర్వహిస్తారనే ప్రశ్న చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. అయితే బీసీసీఐ సోమవారం దీనికి సమాధానమిచ్చింది. బీసీసీఐ తాజాగా చేసిన ప్రకటనలో.. సౌతాంప్టన్‌ మైదానం ఈ టెస్టుకు వేదిక కాబోతోందని వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఈ మ్యచ్ జూన్ 18న ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే ఈ విషయం చాలా రోజుల క్రితమే నిర్ధారించడం జరిగిందని, ఆటగాళ్లు బస చేసేందుకు అవసరమైన హోటల్‌ కూడా స్టేడియానికి సమీపంలోనే ఉందని, ఇది ఒకరకంగా ప్రస్తుతం సమయంలో క్రికెట్‌కు మంచి స్టేడియం అని గంగూలీ అన్నారు. అంతేకాకుండా ఇంగ్లండ్ ఈ స్టేడియంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడడానికి కూడా ఇదే కారణమని గంగూలీ చెప్పుకొచ్చారు.


ఇదిలా ఉంటే 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌ను న్యూజిల్యాండ్ ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ ఓటమితో టీమిండియా టోర్నీ నుంచి బయటకొచ్చేసింది. ఈ సారి టెస్టు సిరీస్ ఫైనల్ మ్యాచ్ మళ్లీ అదే జట్ల మధ్య జరగబోతోంది. మరి ఈ సారి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా..? అనేది వేచి చూడాలి. 

Updated Date - 2021-03-09T02:33:01+05:30 IST