Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 18 Aug 2022 17:50:56 IST

SSMB28: షూటింగ్‌ షురూ కాలేదు.. విడుదల తేదీ వచ్చేసింది!

twitter-iconwatsapp-iconfb-icon

సూపర్‌స్టార్‌ మహేశ్‌(Maheshbabu).. త్రివిక్రమ్‌ (Trivikram)కాంబినేషన్‌లో హాసిని అండ్‌ హారికా క్రియేషన్స్‌ సంస్థ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే! మహేశ్‌కు 28వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. అయితే ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’(SSMB28)గా ప్రకటించిన ఈ సినిమా గురించి ఇప్పటి దాకా సినిమా ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. మధ్యలో మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్‌ విడుదల చేసి, ఆగస్ట్‌లో చిత్రీకరణ మొదలవుతుందనే చెప్పారంతే. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే గురువారం చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న సినిమా విడుదల కానుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే సినిమా షూటింగే మొదలు కాలేదు.. అప్పుడే రిలీజ్‌ డేట్‌ కూడా ఇచ్చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. (SSMB28 releasing on 28 april 2023)


ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల షూటింగ్‌లు నిలిచిపోయాయి. సమస్యలకు పరిష్కారం దొరికిన తర్వాతే చిత్రీకరణలు మొదలవుతాయి. ఈ నెలాఖరు వరకూ షూటింగ్‌లు మొదలయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరోపక్క ఈ నెల 24 నుంచి ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ చిత్రీకరణ ప్రారంభం కానుందని వార్తలొస్తున్నాయి. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకుడు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement