Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 22 Jun 2022 14:06:13 IST

ఎన్టీఆర్ సినిమాని ఫాలో అవుతున్న SSMB 28 టీమ్!

twitter-iconwatsapp-iconfb-icon

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ భారీ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రాబోతోంది. ఇది మహేశ్ కెరీర్‌లో చేస్తున్న 28వ సినిమా. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవలే దర్శకుడు త్రవిక్రమ్, మహేష్‌కు ఫైనల్ నరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కథ మొత్తం విన్న మహేష్ బాబు ఓకే చేయడంతో, రెగ్యులర్ షూటింగ్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీ అయిపోయారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన, సర్ప్రైజింగ్ అప్ డేట్ అంటూ ఓ వార్త బయటికి వచ్చింది. 

ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడట. ఇప్పటివరకూ మహేష్‌ చేసిన సినిమాల్లో డ్యూయల్ రోల్ ప్లే చేయలేదు. మాములుగా తెరపై ఒక మహేశ్ బాబు కనిపిస్తే ఫాన్స్ ని ఆపడం కష్టం. అలాంటిది ఇద్దరు మహేశ్ బాబులు ఒకేసారి తెరపై కనిపిస్తే, ఆ రేంజ్ మరో లెవల్. అంతేకాకుండా సెకండ్ హాఫ్‌లో వచ్చే మహేష్ పాత్ర సినిమాకు మేయిన్ హైలైట్‌గా నిలుస్తుందని, ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయమని టాక్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 'అరవింద సమేత' తరహలోనే, ఓ భారీ ఫైట్ తో ప్రారంభించబోతున్నారని... దీనికి రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తుంచనున్నట్టు సమాచారం.

ఈ ఫైట్ కోసం మాస్టర్స్, ఇప్పడకే భారీ స్కెచ్ కూడా సిద్దం చేశారట. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అరవింద సమేత సినిమా ఓపెనింగ్ కోసం కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్, ఎన్టీఆర్ ని ఒక రేంజులో ఎలివేట్ చేసింది. టాలివుడ్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్స్ లో అరవింద సమేత ఒకటి. ఇదే రేంజులో మహేష్‌తో చేస్తున్న సినిమాలో, హీరో ఇంట్రడక్షన్ ఉండేలా త్రివిక్రమ్, రామ్ లక్ష్మణ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే నెవర్ బిఫోర్ మాస్ హీరోగా మహేష్‌ని చూడబోతున్నాం.. అని నమ్మకంగా చెప్పొచ్చు. థమన్ (Thaman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement