Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 14 Aug 2022 14:31:33 IST

SSMB 28: సర్‌ప్రైజింగ్ అప్‌డేట్..

twitter-iconwatsapp-iconfb-icon

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రూపొందనున్న ఎస్ఎస్ఎంబి 28 (SSMB 28) చిత్రానికి సంబంధించిన సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. మహేష్ గత చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) తర్వాత త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులవుతోంది. కానీ, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ఎప్పుడు మొదలవుతుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అలా చూస్తుండగానే సైలెంట్‌గా సినిమా షూటింగ్ ప్రారంభమయింది.

ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను మహేశ్ భార్య నమ్రత స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. చాలా నెలల తర్వాత మళ్లీ చిత్రీకరణలో పాల్గొన్నారు మహేష్. త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబోలో సినిమా అనగానే ఖచ్చితంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేదుకు గత రెండేళ్లుగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతూ వచ్చారు. త్రివిక్రమ్ గత సినిమా అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక మహేష్ - త్రివిక్రమ్ కలిసి గతంలో చేసిన అతడు, ఖలేజా కమర్షియల్‌గా ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అయితే, ఈ రెండు సినిమాలకు బుల్లితెర మీద మాత్రం మంచి ఆదరణ దక్కింది. అయితే, ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఇద్దరూ ఎంతో పట్టుదలగా ఉన్నారు. మొత్తానికి ఎస్ఎస్ఎంబి 28 షూటింగ్ అప్‌డేట్ తెలిసినప్పటినుంచి సూపర్ స్టార్ అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా గనక పూర్తైతే 2023, సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement