ఆ పరీక్షలు అపే ప్రసక్తే లేదు : మంత్రి

ABN , First Publish Date - 2021-04-17T17:28:17+05:30 IST

రాష్ట్రంలో ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షలు యథావిధిగా సాగుతాయని విద్యార్థులు వదంతులను నమ్మరాదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్‌ వె

ఆ పరీక్షలు అపే ప్రసక్తే లేదు : మంత్రి



బెంగళూరు: రాష్ట్రంలో ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షలు యథావిధిగా సాగుతాయని విద్యార్థులు వదంతులను నమ్మరాదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం చామరాజనగర్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఎస్ఎల్‌సీతో పాటు పీయూ పరీక్షలు ఎట్టి పరిస్థితిలోను రద్దు చేసేది లేదన్నారు. కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జూన్‌ 21న ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షలు నిర్వహించేలా ఇప్పటికే ఖరారు చేశామన్నారు. ఇంకా రెండునెలల వ్యవధి ఉందని ఇప్పుడే నిర్ణయం ఎలా తీసుకుంటామన్నారు. 1-9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు జరిపే విషయమై ఒకటి రెండురోజులలోనే నిర్ణయిస్తామన్నారు. కాగా విధానపరిషత్‌ సభాపతి బసవరాజహొరట్టి మంత్రికి ప్రత్యేకంగా లేఖ రాశారు. కొవిడ్‌ కారణం చూపి ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షలు వాయిదా వేయరాదన్నారు.

Updated Date - 2021-04-17T17:28:17+05:30 IST