Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 29 Mar 2022 10:37:14 IST

ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షలకు 20 వేల మందికిపైగా గైర్హాజరు

twitter-iconwatsapp-iconfb-icon
ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షలకు 20 వేల మందికిపైగా గైర్హాజరు

                                - హిజాబే కారణమా..?


బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షల తొలిరోజు ఏకంగా 20 వేల మందికి పైగా విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో అత్యధికమంది హిజాబ్‌ నిషేధించినందుకు హాజరుకాని వారు ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం తొలిరోజు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. మొత్తం 8,69,399 మంది పరీక్షలు రాసేందుకు అర్హులు కాగా 8,48,405 మంది రాశారు. 20,994 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో ఏటా 9 లక్షల మంది దాకా పరీక్షలు రాస్తుంటారు. ఇందులో వివిధ కారణాలతో మూడునా లుగువేల మంది దాకా గైర్హాజరవుతుంటారు. కానీ ప్రస్తుతం 20 వేల మం దికి పైగా దాకా గైర్హాజరు కావడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో మూడునెలల కిందట ఉడుపిలోని బాలికల జూనియర్‌ కళాశాలలో హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరుకావడం వివాదమైంది. ఆరుగురు పీయూ విద్యార్థినులు హిజాబ్‌ వద్దంటే తరగతులకు వెళ్లేది లేదని నెలరోజుల పాటు నిరసన తెలపడం, హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఇక్కడి హిజాబ్‌ వివాదం జాతీయస్థాయి దాకా సాగింది. కాగా ఇటీవలే విద్యాసంస్థల్లో ఏవిధమైన మతానికి చెందిన దుస్తులు ధరించరాదని హైకోర్టు తీర్పునిచ్చింది. తర్వాత జరుగుతున్న తొలి పరీక్షలు ఎస్‌ఎస్ఎల్‌సీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఎన్నడూ ఇంతస్థాయిలో విద్యార్థుల గైర్హాజరు కాలేదు. హిజాబ్‌తో పరీక్షలకు వెళ్లకూడదనే ఎక్కువ మంది హాజరుకాలేదని తెలుస్తోంది. అయితే వీరిలో ఎంతమంది అనేది స్పష్టంగా తెలియదని విద్యాశాఖ ప్రకటించింది. పరీక్షలు జరిగిన 3,444 కేంద్రాల్లో పోలీసు బందోబస్తుతో పాటు 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఎస్‌ఎస్ఎల్‌సీ విద్యార్థులందరూ ఉత్సాహంగా పరీక్షల్లో పాల్గొనాలని సీఎం బసవరాజ్‌బొమ్మై ఆకాంక్షించారు. కాగా పరీక్షల తర్వాత విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్‌ మాట్లాడుతూ ఎటువంటి సమస్య లేకుండా తొలిరోజున పరీక్షలు జరిగాయన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. కాగా మంగళూరుకు చెందిన ముస్లిం మతగురువులు విద్యార్థులు పరీక్షలుకు వెళ్లాలని సూచించారు. బెంగళూరు కేటీఎ్‌సవీ పాఠశాల పరీక్షా కేంద్రానికి హిజాబ్‌తోనే విధులకు వచ్చిన ఇన్విజిలేటర్‌ నూర్‌ ఫాహిమాను అధికారులు సస్పెండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40కు పైగా ప్రాంతాలలో హిజాబ్‌తోనే విద్యార్థులు కేంద్రాలలోకి ప్రవేశించేందుకు యత్నించగా ఉపాధ్యాయుల సూచనలతో తొలగించి పరీక్షలు రాశారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.