జర్మనీ కంపెనీతో ఎస్‌ఎస్ఈ జట్టు

ABN , First Publish Date - 2021-12-02T06:21:46+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎ్‌సఈఎల్‌).. జర్మనీకి చెందిన విరిడి్‌స.ఐక్యూ,.....

జర్మనీ కంపెనీతో ఎస్‌ఎస్ఈ జట్టు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌కు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎ్‌సఈఎల్‌).. జర్మనీకి చెందిన విరిడి్‌స.ఐక్యూ, జీఎంబీహెచ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 4000 మెగావాట్ల సామర్థ్యం గల పాలీసిలికాన్‌, ఇంగోట్‌ వేఫర్‌, సెల్‌, మాడ్యూల్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. జర్మనీలో భారత రాయబారి హరీష్‌ సమక్షంలో ఎస్‌ఎ్‌సఈఎల్‌, విరిడిస్‌ కంపెనీల ప్రతినిధులు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా దశలవారీగా ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్‌ఎ్‌సఈఎల్‌ సీఈ ఓ శరత్‌ చంద్ర తెలిపారు. తొలిదశలో రెండు సంస్థలు.. డిజైన్‌, వ్యాపార ప్రణాళికలను సిద్ధం చేసుకుని ప్రాజెక్టును ప్రారంభిస్తాయని చెప్పారు. తర్వాతి దశలో విరిడిస్‌ అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుందన్నారు. విరిడిస్‌ భాగస్వామంతో ప్రపంచ స్థాయి సోలార్‌ సెల్స్‌, మాడ్యుల్స్‌ను ఉత్పత్తి చేయటంతో పాటు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశం ఎస్‌ఎ్‌సఈఎల్‌కు లభిస్తుందన్నారు.

Updated Date - 2021-12-02T06:21:46+05:30 IST