SSC SCAM: అర్పిత ముఖర్జీ ఇంకో ఇంట్లో మరిన్ని నోట్ల కట్టలు

ABN , First Publish Date - 2022-07-28T00:57:51+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించిన ఎస్‌ఎస్‌సీ స్కామ్‌ కీలక మలుపులు..

SSC SCAM: అర్పిత ముఖర్జీ ఇంకో ఇంట్లో మరిన్ని నోట్ల కట్టలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించిన ఎస్‌ఎస్‌సీ (School Service Commission) స్కామ్‌ కీలక మలుపులు తిరుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee) ఇంట్లో ఇప్పటికే రూ.21 కోట్ల నగదును పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఆమెకే చెందిన మరో ఇంట్లో మరింత నగదును స్వాధీనం చేసుకుంది. నోట్ల లెక్కింపు జరుగుతోంది. ఎస్‌ఎస్‌సీ కుంభకోణం కేసులో అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ గత శనివారంనాడు అర్పితా ఛటర్జీని అరెస్టు చేసింది. ఆమె ఇంట్లో దొరికిన సొమ్మును లెక్కపెట్టేందుకు నోట్ కౌటింగ్ మిషన్లతో సహా బ్యాంకు అధికారులను ఈడీ రప్పించింది. నగదుతో పాటు మరిన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది.


ఈడీ అధికారుల సమాచారం ప్రకారం, అర్పితా ముఖర్జీ పూర్తిగా అధికారులకు సహకరిస్తోంది. అయితే, బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ మాత్రం దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదు. ''ఛటర్జీని ప్రశ్నించి వివరాలు రాబట్టడం చాలా కష్టంగా ఉంది. చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. అధికారులకు ఏమాత్రం సహకరించడం లేదు. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు'' అని ఈడీ అధికారి ఒకరు చెప్పారు.

Updated Date - 2022-07-28T00:57:51+05:30 IST