Abn logo
Jan 19 2021 @ 17:16PM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌

ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా.. భారీ బడ్జెట్‌, హైటెక్నికల్ వేల్యూ‌తో రూపొందుతోన్న ప్యాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)'. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.వి.వి.దానయ్య అన్‌కాంప్రమైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. 'బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌తో పాటు, భీమ్‌ ఫర్‌ రామరాజు, రామరాజు ఫర్‌ భీమ్‌ టీజర్‌లకు వరల్డ్‌ వైడ్‌గా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ పాత్రను నిప్పుతో, ఎన్టీఆర్‌ పాత్రను నీటితో పోల్చుతూ.. రాజమౌళి సృష్టిస్తోన్న అద్భుతాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా..! అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా చిత్రయూనిట్‌ ఓ అప్‌డేట్‌ను విడుదల చేసింది.


ఈ చిత్రం క్లైమాక్స్‌ షూటింగ్‌ స్టార్ట్ అయినట్లుగా తెలుపుతూ.. భీమ్‌, రామరాజులు చేతులు కలిపిన పిక్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. భీమ్‌, రామరాజు కలిసి వారు సాధించాలనుకున్నది సాధించేందుకు సిద్ధమవుతున్నారని తెలుపుతూ.. చిత్రయూనిట్‌ విడుదల చేసిన పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్‌ సమాచారం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సేకరించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఇంకా 20 శాతం షూటింగ్‌ జరగాల్సి ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో మిగిలి ఉన్న షూటింగ్‌ జరుగుతోంది. అలాగే ఇందులో నాలుగు పాటలు ఉంటే.. ఈ నాలుగు పాటల్లోనూ ఇద్దరు హీరోలు కనిపించనున్నారట. మరో పాటను రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేసేలా జక్కన్న ప్లాన్‌ చేస్తున్నారట. మిగిలి ఉన్న 20 శాతం షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ అంతా పూర్తి చేసి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని విజయదశమికి థియేటర్లలోకి తీసుకురావాలనేలా రాజమౌళి అండ్‌ టీమ్‌ వర్క్‌ చేస్తోందట.Advertisement
Advertisement
Advertisement