గోరంట్లలో ఘనంగా శ్రీవారి కల్యాణం

ABN , First Publish Date - 2021-02-24T06:32:59+05:30 IST

స్థానిక శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం 23వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

గోరంట్లలో ఘనంగా శ్రీవారి కల్యాణం
శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులు

గోరంట్ల, ఫిబ్రవరి 23: స్థానిక శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం 23వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు నాగేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.    ఈ సందర్భంగా వాసవీ మాత జీవిత చరిత్ర తెలిసేవిధంగా ఆలయ గర్భగుడిపై మ్యూజియం ఏర్పాటుకు భూమిపూజ చేశారు.  కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు బలరాం గుప్త నందగోపాల్‌, జనార్దన్‌గుప్త, మాధవగుప్తా, సూర్యప్రకాశ్‌, సుధాకర్‌, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-24T06:32:59+05:30 IST