Abn logo
Oct 20 2021 @ 01:35AM

శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు

కదిరి,  అక్టోబరు 19: ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం హుండీ ఆదాయం  లెక్కింపును మంగళవారం పూర్తి చేశారు. 33 రోజులకు గాను రూ.50,06,600 ఆదాయం వచ్చిందని ఆలయ కమిటీ చైర్మన్‌ కాంభోజి రెడ్డెప్పశెట్టి, ఈఓ వెంకటేశ్వ రరెడ్డి తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆర్‌ శ్రీనివా సులు, ఎం న రసింహులునాయక్‌, శశికళ, అనురాధ, శారద పాల్గొనగా హుండీ పర్యవేక్షణ అధికారిగా ఆలయ ఈఓ ఈశ్వరరెడ్డి హాజరయ్యారు. లెక్కింపు కార్యక్రమం లో దేవ స్థానం సిబ్బందితో పాటు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ విశ్వనా థన్‌, బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.