శ్రీవారి దర్శనాల రద్దు ఏప్రిల్‌ 14 వరకు పొడిగింపు

ABN , First Publish Date - 2020-03-31T12:08:29+05:30 IST

శ్రీవారి దర్శనాల రద్దు ఏప్రిల్‌ 14 వరకు పొడిగింపు

శ్రీవారి దర్శనాల రద్దు ఏప్రిల్‌ 14 వరకు పొడిగింపు

తిరుమల: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాల నిలుపుదలను ఏప్రిల్‌ 14వ వరకు పొడిగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తొలుత మార్చి 20 నుంచి 27 వరకు శ్రీవారి దర్శనాలను రద్దు చేసి భక్తులెవ్వరు తిరుమలకు రాకుండా ఘాట్‌రోడ్లు మూసివేశారు. ఆ తర్వాత 31 వరకు దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. తాజాగా ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ఉండడంతో శ్రీవారి దర్శనాలను కూడా అప్పటివరకు నిలుపుదల చేస్తున్నట్టు సోమవా రం టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్‌ 2న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే హనుమంత వాహనసేవను రద్దుచేసి శ్రీరామనవమి ఆస్థానం, 3న శ్రీరామ పట్టాభిషేక వేడుకలను, 5 నుంచి 7 వరకు జరుగనున్న వార్షిక వసంతోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2020-03-31T12:08:29+05:30 IST