Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 28 Jan 2022 09:37:43 IST

బాలీవుడ్‌లోనూ శ్రీవల్లి ట్రెండ్‌!

twitter-iconwatsapp-iconfb-icon
బాలీవుడ్‌లోనూ శ్రీవల్లి ట్రెండ్‌!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! బాక్సాఫీస్‌ దద్దరిల్లే వసూళ్లు రాబట్టింది. సినిమా ట్రైలర్‌ నుంచీ పాటల వరకూ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ చిత్రంలో పాటలు తెలుగులోనే కాకుండా ప్యాన్‌ ఇండియా స్థాయిలో కూడా గుర్తింపు పొందాయి. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రతి నోట నానుతూనే ఉన్నాయి. వాటిలో సెన్సేషన్‌ హిట్‌ గురించి చెప్పాలంటే ‘శ్రీవల్లి’ పాటే గుర్తొస్తుంది. ఈ పాట తెలుగుతోపాటు హిందీలోనూ భారీ హిట్‌గా నిలిచింది. హిందీ వెర్షన్‌ పాట 100 మిలియన్‌ వ్యూస్‌ 2 మిలియన్లకు పైగా లైక్స్‌ని క్రాస్‌ చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో హిట్‌ నిలిచిన పాటలకే పోటీగా నిలిచింది. తాజాగా ఈ పాట మరో రికార్డ్‌ సృష్టించిందని టీ సిరీస్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. 


గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన పాటగా ‘శ్రీవలి’్ల హిందీ వెర్షన్‌ పాట ట్రెండింగ్‌లో ఉంది. శ్రీవల్లి పాట ఎంత వేగంగా జనాల్లోకి వెళ్తుందో అర్థమవుతోంది. బన్నీ మాస్‌ లుక్‌, సిగ్నేచర్‌ స్టెప్‌తోపాటు రష్మిక గ్లామర్‌ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 




Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement