సూర్య కిరణ మనో రంజితం
రమణీయ ప్రకృతి సోయగం
మకర సంక్రాంతి శుభ తరుణం స్వాగతం ‘శుభకృతు’
రంగు మారుతున్న రంగవల్లికలు
స్వరం మారుతున్న అనురాగాలు
అడుగడుగున ఎన్నో అవాంతరాలు నిరాశానిస్పృహలు
తెర తొలిగిస్తే మహమ్మారి ప్రళయం
తెగించి ఛేదించకు భద్రతా వలయం
తొలి భాను కిరణం కావాలి భోగభాగ్య శుభ శోభిత సంక్రాంతి
– శ్రీవల్లిభాస్కర్ మైలవరపు