నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-01-12T14:19:54+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానలో ఈరోజు నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానలో ఈరోజు నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.  ఇవాళ ఉదయం 9:15 గంటలకు యాగశాల ప్రవేశం జరుగనుండగా, సాయంత్రం 5:30 గంటల నుండి అంకురారోపణ ధ్వజారోహణ పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ నుండి 18 వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, స్వామి అమ్మవార్ల కల్యాణం ఏకాంతసేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈఓ లవన్న తెలిపారు. 

Updated Date - 2022-01-12T14:19:54+05:30 IST