Abn logo
Oct 14 2021 @ 08:04AM

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరదనీరు ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ప్లో 67,975 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 94,374 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటినిల్వ  214.8450 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

ఇవి కూడా చదవండిImage Caption