శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-10-20T14:38:15+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో : 4,01, 818 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ పది గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అవుట్ ఫ్లో 5,96,497 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ 208.7210 టీఎంసీలుగా కొనసాగుతోంది. అటు శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2020-10-20T14:38:15+05:30 IST