కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 34,277 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 72,339 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.