శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న ప్రవాహం

ABN , First Publish Date - 2022-07-27T14:18:05+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. గత రెండు రోజుల క్రితం వరద తగ్గుముఖం పట్టి..మళ్లీ వర్షాలు భారీగా పడుతుండటంతో

శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న ప్రవాహం

నంద్యాల: శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project)కు వరద ప్రవాహం కొనసాగుతుంది. గత రెండు రోజుల క్రితం వరద తగ్గుముఖం పట్టి..మళ్లీ వర్షాలు భారీగా పడుతుండటంతో వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 55,770 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 63,498 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 880.10 అడుగులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.807 కాగా, ప్రస్తుత నీటినిల్వ 188.754 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2022-07-27T14:18:05+05:30 IST