Abn logo
Sep 9 2021 @ 10:07AM

Srisailam జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ప్లో 87,103 క్యూసెక్కులుగా ఉండగా...ఔట్ ఫ్లో  నిల్ ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 878.30 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 179.5140 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.