Abn logo
Jul 31 2021 @ 07:58AM

AP: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద...10 గేట్లు ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఇన్ ఫ్లో 4,82,600 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,34,189 క్యూసెక్కులుగా ఉంది. అలాగే శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884 అడుగులకు చేరింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 207.4103 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు  కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో  విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.