Abn logo
Aug 4 2021 @ 07:51AM

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..8 గేట్లు ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఇన్ ఫ్లో 3,16,230 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,83,269 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 208 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.