కర్నూలు: శ్రీశైలం దేవస్దానం నూతన పాలకమండలి చైర్మన్గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. 15 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో దేవస్థానం పరిపాలన భవనంలో 15 మంది నూతన పాలకమండలి సభ్యలతో ఈఓ లవన్న ప్రమాణం చేయించారు. 15 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డు మెంబర్ల పేర్లను దేవాదాయశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తన్నీరు ధర్మరాజు కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి హాజరయ్యారు. శ్రీశైలం దేవస్థానం పాలకమండలి చైర్మన్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి రెడ్డివారి చక్రపాణిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి