కర్నూలు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. శివనామస్మరణతో ఆలయ పురవీధులు మారుమ్రోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవరోజు శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారికి గజవాహనసేవ నిర్వహించనున్నారు. సాయంత్రం శ్రీశైల పురవీధులలో గజవాహనంపై స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం జరుగనుంది.
ఇవి కూడా చదవండి