బ్రహ్మచారిణిగా శ్రీశైల భ్రామరి

ABN , First Publish Date - 2020-10-19T07:08:54+05:30 IST

శ్రీశైలంలో దసరా నవరాత్రి మహోత్సవాల్లో రెండోరోజు ఆదివారం రాత్రి అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి,

బ్రహ్మచారిణిగా శ్రీశైల భ్రామరి

స్వామి, అమ్మవార్లకు మయూర వాహనసేవ 

కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 18: శ్రీశైలంలో దసరా నవరాత్రి మహోత్సవాల్లో రెండోరోజు ఆదివారం రాత్రి అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు మయూర వాహన సేవను నిర్వహించారు.

కుమారీ పూజలో భాగంగా రెండేళ్ల నుంచి పదేళ్ల వయసున్న బాలికలకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తికి బ్రహ్మచారిణి అలంకరణ చేశారు.

అమ్మవారు కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి భక్తులను కటాక్షించారు. 


Updated Date - 2020-10-19T07:08:54+05:30 IST