సీతారాముల కల్యాణంపై ఆంక్షలా?.. మండిపడిన సీతారామ శాస్త్రి

ABN , First Publish Date - 2021-04-21T22:53:41+05:30 IST

‘‘భగవంతుడి కల్యాణానికే కరోనా వచ్చిందా? సమావేశాలు, ర్యాలీలకు కరోనా గుర్తు రాదా? తినండి.. తినండి.. ఇంట్లో ఉండి తినడం వల్ల కొవ్వు పెరిగి జబ్బులు పెరిగిపోతాయి.

సీతారాముల కల్యాణంపై ఆంక్షలా?.. మండిపడిన సీతారామ శాస్త్రి

విశాఖ: ఆయన పేరు సీతారామ శాస్త్రి. విశాఖ జిల్లాలోని ఓ రామాలయంలో పూజారి. రాముడికి అపర భక్తుడు. నిత్యం సీతారాముల సేవలో తరిస్తున్నారు. రామచంద్ర స్వామి ఆరాధనే ఆయనకు ప్రీతి. గతేడాది కరోనా కారణంగా సీతారాముల కల్యాణాన్ని సాదాసీదాగా జరపాల్సి వచ్చింది. పరిస్థితులు అన్నీ చక్కబడుతున్నాయి అనుకుంటున్న తరుణంలో.. ఈ ఏడాది తన స్వామి వారి కల్యాణం ఘనంగా జరపాలనుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా సీతారాముల కల్యాణంపై మళ్లీ ఆంక్షలు విధించారు. దీంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.


ప్రభుత్వాల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘‘భగవంతుడి కల్యాణానికే కరోనా వచ్చిందా? సమావేశాలు, ర్యాలీలకు కరోనా గుర్తు రాదా? తినండి.. తినండి.. ఇంట్లో ఉండి తినడం వల్ల కొవ్వు పెరిగి జబ్బులు పెరిగిపోతాయి. కనీసం రామనామాన్ని జపించండి. రాముడి గొప్పతనాన్ని తెలుసుకోండి. ఇండోనేషియాలో రామాయణం జాతీయ గ్రంథం.. మన భారతదేశంలో పనికిమాలిన గ్రంథాలన్నీ ఉన్నాయి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-04-21T22:53:41+05:30 IST