Apr 22 2021 @ 01:13AM

శ్రీరామ నవమి స్పెషల్‌ లుక్స్‌

తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ శ్రీరామ నవమి సందర్భంగా ప్రేక్షకులకు  శుభాకాంక్షలు తెలుపుతూ పలు నిర్మాణ సంస్థలు తమ చిత్రాల నుంచి ప్రత్యేక పోస్టర్‌లను విడుదల చేశాయి. 


రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న చిత్రం ‘ఖిలాడి’. ఈ సినిమా నుంచి హీరో రవితేజ్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి చిత్రయూనిట్‌ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. 


‘వరుడు కావలెను’ చిత్రం నుంచి సీతారాముల పట్టాభిషేకం చిత్రపటం ముందు కూర్చొని ఉన్న నౌగశౌర్య లుక్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘టక్‌ జగదీష్‌’ చిత్రం నుంచి హీరో నాని, హీరోయిన్‌ రీతూవర్మ కోవెల ముందు కూర్చొని ఉన్న లుక్‌ను విడుదల చేసింది. 


సందీప్‌ కిషన్‌, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘గల్లీ రౌడీ’. హీరోయిన్‌ను ఫాలో అవుతోన్న హీరో లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.


రానా, సాయిపల్లవి జంటగా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తోన్న ‘విరాట పర్వం’ చిత్ర యూనిట్‌ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది.


‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’, ‘బ్లాక్‌బస్టర్‌’, ‘ఛిల్‌ బ్రో’, ‘డబుల్‌ డోస్‌’, ‘ఇందువదన’, ‘కథ కంచికి మనం ఇంటికి’, ‘ఫస్ట్‌టైమ్‌’, ‘నేను లేని నా ప్రేమకథ’, ‘చేరువైనా దూరమైనా’, ‘రాంగ్‌ నంబర్‌’, ‘ఇక్షు’, ‘పాగల్‌’, ‘రామచంద్రాపురం’, ‘గ్రంథాలయం’, ‘ఆకాశవాణి’, ‘హామీ’, ‘జీఎస్‌టీ’, ‘భారీ తారాగణం’ ‘కోతి కొమ్మచ్చి’ తదితర చిత్రాల నుంచి ప్రేక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ లుక్స్‌ విడుదల చేశారు.