Abn logo
Sep 21 2021 @ 01:13AM

ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

నియామకపత్రం అందుకుంటున్న శ్రీనివాసరావు

ముండ్లమూరు, సెప్టెంబరు 20 : ముండ్లమూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ముండ్లమూరుకు చెందిన  పులికొండ శ్రీనివాసరావును సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండ లంలోని ఆర్యవైశ్యులు సోమ వారం ముండ్ల మూరులో సమావేశమయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడిగా పులికొండ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా శిఖాకొల్లి సుబ్బారావు, పులికొండ బ్రహ్మేశ్వరరావు, చల్లగుండ్ల ఏడుకొండలు, మండల ప్రధాన కార్యదర్శిగా అమరా ప్రసాదు, కోశాధికారిగా మిత్తింటి పుల్లారావు, జిల్లా కౌన్సిలర్లుగా వలేటి రమేష్‌, అమరా శ్రీరామమూర్తి, మరో ఆరుగురిని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూరే సుబ్బారావు, ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పలపోతు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కోటా వెంకటేశ్వర్లు, దేవతి వరప్రసాదు, అమరా భాను ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.