గజవాహనంపై శ్రీనివాసుడు

ABN , First Publish Date - 2022-10-03T05:57:23+05:30 IST

జిల్లాకేంద్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం గజవాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు.

గజవాహనంపై శ్రీనివాసుడు
హౌసింగ్‌బోర్డులో గజవాహనంపై దర్శనమిస్తున్న శ్రీవారు

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 2: జిల్లాకేంద్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం గజవాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, హౌసింగ్‌ బోర్డులోని వెంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ఉదయం స్వామివారి మూలవిరాఠ్‌లకు సుప్రభాత సేవ, పుష్పాలంకరణలు, తోమాల సేవలు నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, శ్రీవారి అష్టోత్తర శతనామావళి పూజ, కుంకుమార్చనలు చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తిని గజవాహనంపై ఆశీనులు గావించి భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఊరేగించారు.



రూ. కోటితో అమ్మవారి స్వర్ణ విగ్రహం

గుంతకల్లు, అక్టోబరు2: పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో రూ. కోటి వెచ్చించి తయారు చేసిన అమ్మవారి స్వర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆదివారం పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు కేజీ 800 గ్రాముల బంగారంతో విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని 4.5 కేజీల వెండి పీఠంపై ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని ఆదివారం ఆలయానికి తెచ్చి పంచామృతాభిషేకాన్ని చేసి, బంగారాన్ని వితరణగా ఇచ్చిన భక్తులతో క్షీరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్య క్షుడు పువ్వాడి చంద్రశేఖర్‌, కార్యదర్శి శంకర నారాయణ, అధికార ప్రతినిధి గుంతా రమేశబాబు, వైద్యు రాలు పత్తి హిమబిందు, సంఘ నాయకులు పత్తి సర్వేశ్వర ప్రసాద్‌, లోకేంద్ర, కేదార్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-03T05:57:23+05:30 IST