వేంకటాద్రిరామునిగా శ్రీనివాసుడు

ABN , First Publish Date - 2022-10-03T09:29:49+05:30 IST

సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఆరవరోజు ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి మూడు వాహనాల్లో భక్తకోటికి దర్శనమిచ్చారు. ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథం, రాత్రి గజవాహనంపై ..

వేంకటాద్రిరామునిగా శ్రీనివాసుడు

హనుమంత, స్వర్ణరథంపై గోవిందుని అభయం

రాత్రి గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

వాహనసేవలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి


తిరుమల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఆరవరోజు ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి మూడు వాహనాల్లో భక్తకోటికి దర్శనమిచ్చారు. ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథం, రాత్రి గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఉదయం శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి స్వర్ణ రథంలో కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులను ఆశీర్వదించారు. 


హనుమంత వాహనసేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు సతీ్‌షరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవమూర్తులకు హారతి ఇవ్వడంతో పాటు వాహనాన్ని సీజేఐ తన భుజాలపై వాహనాన్ని కొద్ది సమయం ఎత్తుకున్నారు.

Updated Date - 2022-10-03T09:29:49+05:30 IST