శ్రీనగర్‌లో భారీ హిమపాతం...రాకపోకలకు బ్రేక్

ABN , First Publish Date - 2021-01-24T10:56:13+05:30 IST

జమ్మూకశ్మీరులో భారీ హిమపాతం వల్ల రవాణ స్తంభించి పోయింది....

శ్రీనగర్‌లో భారీ హిమపాతం...రాకపోకలకు బ్రేక్

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులో భారీ హిమపాతం వల్ల రవాణ స్తంభించి పోయింది. విస్తారంగా మంచు కురుస్తుండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. శ్రీనగర్, మండీ, పూంచ్, జమ్మూ, కశ్మీరు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా మంచు కురుస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండీ, పూంచ్ ప్రాంతాల్లో రోడ్లపై ఆరు అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. చాలా ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీరులో భారీగా మంచు కురుస్తుందని శ్రీనగర్ వాసి బషీర్ చెప్పారు.వారం రోజుల క్రితం జమ్మూ, కశ్మీర్ ప్రాంతంలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్షియస్ కు చేరింది. శ్రీనగర్ లోని దాల్ సరస్సులో నీరు గడ్డ కట్టింది. భారీగా మంచు కురుస్తున్నా జమ్మూకశ్మీరులో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేదని అధికారులు చెప్పారు.

Updated Date - 2021-01-24T10:56:13+05:30 IST