ఆస్పత్రిలోకి వీధి కుక్కలు.. అందుకే వచ్చేశాం!

ABN , First Publish Date - 2020-03-27T06:22:48+05:30 IST

ఆస్పత్రిలో ఆమెను ఉంచిన వార్డులోకి వీధి కుక్కలు వస్తున్నాయి. దాంతో భయపడి ఆమెను ఇంటికి తీసుకువచ్చేశాం’’ అని శ్రీనగర్‌కు..

ఆస్పత్రిలోకి వీధి కుక్కలు.. అందుకే వచ్చేశాం!

‘‘ఆస్పత్రిలో ఆమెను ఉంచిన వార్డులోకి వీధి కుక్కలు వస్తున్నాయి. దాంతో భయపడి ఆమెను ఇంటికి తీసుకువచ్చేశాం’’ అని శ్రీనగర్‌కు చెందిన కరోనా అనుమానిత మహిళ కుటుంబం తెలిపింది. ‘‘శ్రీనగర్‌లోని ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో పరిస్థితి చూసి భయపడే బయటకురావాల్సి వచ్చింది. అధికారులు చెబుతున్నట్లు ఆమె పారిపోలేదు’’ అని వివరించింది. ఇంటికి వచ్చినా వైద్యులకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపింది. కాగా, పూంచ్‌లో ఆరుగురికి కరోనా సోకిందని తప్పుడు వార్త ప్రచురించిన ఓ ఉర్దూ పత్రిక యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-03-27T06:22:48+05:30 IST