distribution: శ్రీలంకకు మూడో విడత సహాయాల పంపిణీ

ABN , First Publish Date - 2022-07-24T16:11:00+05:30 IST

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంక(Srilanka) ప్రజలను ఆదుకునే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడో విడతగా రూ.74 కోట్ల విలువై

distribution: శ్రీలంకకు మూడో విడత సహాయాల పంపిణీ

చెన్నై, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంక(Srilanka) ప్రజలను ఆదుకునే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడో విడతగా రూ.74 కోట్ల విలువైన సహాయాలతో తూత్తుకుడి వావుసి ఓడరేవు నుంచి ఓ నౌక బయలుదేరింది. డీఎంకే ఎంపీ కనిమొళి(Kanimoli) నిత్యావసర వస్తువుల లోడుతో ఉన్న వీటీసి సన్‌ నౌకాయానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ(Central Govt) అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం శ్రీలంకకు ఇప్పటివరకూ రెండు విడతలుగా నౌకల్లో సహాయాలను పంపింది. గత మే 18న మద్రాసు(Madras) హార్బర్‌ నుంచి 9.045 టన్ను బియ్యం, 50 టన్నుల ఆవిన్‌ పాలపొడిని, ఎనిమిది టన్నుల మేరకు మందులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఓ నౌకలో పంపారు. ఆ తర్వాత తూత్తుకుడి వావుసి ఓడరేవు నుంచి మరో నౌకలో గత జూన్‌ 22న 67,70 కోట్ల విలువైన 15 వేల టన్నుల బరువుగల నిత్యావసర వస్తువులు పంపారు. ఈ నేపథ్యంలో మూడో విడతగా రూ.54 కోట్ల విలువైన 16,356 టన్నుల బియ్యం, రూ.6 కోట్ల విలువైన 201 టన్నుల పాలపొడి, రూ.14 కోట్ల విలువైన 39 టన్నుల మందులను శ్రీలంక(Srilanka)కు ఓడలో పంపారు. కార్యక్రమంలో మంత్రులు సెంజి మస్తాన్‌ గీతా జీవన్‌, అనితా రాధాకృష్ణన్‌, కలెక్టర్‌ సెంథిల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-24T16:11:00+05:30 IST