శ్రీలంక ఆర్థిక సంక్షోభం: అధ్యక్షుడు రాజీనామా చేయరన్న మంత్రి

ABN , First Publish Date - 2022-04-07T02:00:27+05:30 IST

69 లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న అధ్యక్షుడు ఎందుకు రాజీనామా చేయాలి? ఒక ప్రభుత్వంగా ప్రజలకు మేము కొన్ని విషయాల్ని స్పష్టం చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ అధ్యక్షుడు రాజీనామా చేయరు. సందర్భం ఎలాంటిదైనా, ఎంత విపత్కరమైనదైనా దాన్ని ఎదుర్కొంటాం..

శ్రీలంక ఆర్థిక సంక్షోభం: అధ్యక్షుడు రాజీనామా చేయరన్న మంత్రి

కొలంబో: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అధ్యక్షుడు గోటబయ రాజీనామా చేసే ప్రసక్తే లేదని శ్రీలంక ప్రభుత్వ విప్, హైవే మంత్రి జాన్‌స్టన్ ఫెర్నాండో తేల్చి చెప్పారు. దేశంలో కొనసాగుతున్న నిరసనలు ప్రతిపక్ష పార్టీల కుట్ర అన్న ఆయన.. దేశంలోని పరిస్థితిని ఎదుర్కొంటామని అన్నారు.


‘‘69 లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న అధ్యక్షుడు ఎందుకు రాజీనామా చేయాలి? ఒక ప్రభుత్వంగా ప్రజలకు మేము కొన్ని విషయాల్ని స్పష్టం చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ అధ్యక్షుడు రాజీనామా చేయరు. సందర్భం ఎలాంటిదైనా, ఎంత విపత్కరమైనదైనా దాన్ని ఎదుర్కొంటాం. ప్రతిపక్ష పార్టీలు దేశంలో కావాలని అల్లర్లు సృష్టిస్తున్నాయి. అందులో జనతా విముక్తి పరమునావాస్ (జేవీపీ) లాంటి పార్టీలు ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. వీళ్లంతా దొంగలు’’ అని ఫెర్నాండో అన్నారు.


శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితి అమలు చేస్తున్నట్లు ఏప్రిల్ 1 న అధ్యక్షుడు గొటమయ ప్రకటించారు. అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆయన ప్రైవేటు నివాసం ముందు పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. కాగా, అధికారంలో ఉన్న పార్టీ క్రమంగా తమ ఎంపీలను కోల్పోయి ప్రభుత్వాన్ని మైనారిటీలోకి తెచ్చుకునేలా ఉంది. మంగళవారం అధికార పార్టీకి చెందిన 40 మంది ఎంపీలు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2022-04-07T02:00:27+05:30 IST