Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 29 Mar 2022 09:27:14 IST

Srilanka శరణార్ధుల కోసం పర్యవేక్షణ

twitter-iconwatsapp-iconfb-icon
Srilanka శరణార్ధుల కోసం పర్యవేక్షణ

పెరంబూర్‌(చెన్నై): శ్రీలంక శరణార్ధుల చొరబాటును నాగపట్టణం జిల్లా కొడియకరై ప్రాంతంలో ఆధునిక హోవర్‌ క్రాఫ్ట్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. శ్రీలంకలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో, అక్కడ నివసిస్తున్న తమిళులు రాష్ట్రానికి వలస బాటపట్డారు. సముద్ర మార్గం ద్వారా ధనుష్కోటికి కుటుంబాలతో సహా చేరుకుంటున్న శరణార్ధులను అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. రాబోయే రోజుల్లో శ్రీలంక వచ్చే శరణార్ధుల సంఖ్య భారీగా పెరగవచ్చనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలతో జాతీయ నావికాదళానికి చెందిన హోవర్‌ క్రాఫ్ట్‌ పడవ ద్వారా తీరప్రాంత భద్రతా దళాలు గస్తీ ముమ్మరం చేశాయి. అదే సయమంలో రాష్ట్రం నుంచి శ్రీలంకకు ఆహారం, బంగారం, మాదకద్రవ్యాలు తరలిస్తున్నారా? అనే దిశగా కూడా వారం రోజులుగా గస్తీ ముమ్మరం చేసినట్లు నావికాదళం తెలిపింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.