12న శ్రీకృష్ణ సుదర్శన హోమం

ABN , First Publish Date - 2020-08-10T11:09:28+05:30 IST

కొవిడ్‌ కారణంగా ఈ ఏ డాది శ్రీకృష్ణజన్మాష్టమి వేడుక లకు బదులుగా దేశ ప్రజలు కరోనా నుంచి విముక్తి పొం దాలని లోక కల్యాణార్థం ..

12న శ్రీకృష్ణ సుదర్శన హోమం

ఏలూరు రూరల్‌, ఆగస్టు 9 : కొవిడ్‌ కారణంగా ఈ ఏ డాది శ్రీకృష్ణజన్మాష్టమి వేడుక లకు బదులుగా దేశ ప్రజలు కరోనా నుంచి విముక్తి పొం దాలని లోక కల్యాణార్థం జి ల్లా, ఏలూరు నగర యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన ఎన్‌ఆర్‌పేట యాదవ సంఘం కార్యా లయం వద్ద శ్రీకృష్ణ సుదర్శన హోమం నిర్వహించనున్నట్టు జిల్లా యాదవ సంఘం నాయకులు తెలిపారు.  ఉపముఖ్య మంత్రి ఆళ్ల నాని, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు, జిల్లా అధ్యక్షుడు కె.సూర్యనారాయణ హాజరవుతారన్నారు. సమావేశంలో చిదరబోయిన శ్రీను, కె.బుజ్జి, చిన్ని రాంబాబు, కె.జగదీశ్‌, ఈశ్వరరావు, ఉక్కుసూరి గోపాలకృష్ణ, కె.శ్రీను, కె.కృపానందం, కె.వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-10T11:09:28+05:30 IST