ఏపీఎల్‌ క్రికెట్‌ పోటీలకు శ్రీకాంత్‌

ABN , First Publish Date - 2022-06-30T05:10:21+05:30 IST

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏపీఎల్‌ (ఆంధ్ర ప్రీమియం లీగ్‌) క్రికెట్‌ పోటీలకు వాల్మీకిపురం సబ్‌ సెంటర్‌ నుంచి మీడియం పేసర్‌ వి.శ్రీకాంత్‌ ఎంపికైనట్లు కోచ్‌ జి.సునీల్‌కుమార్‌ తెలిపారు.

ఏపీఎల్‌ క్రికెట్‌ పోటీలకు శ్రీకాంత్‌
శ్రీకాంత్‌తో కోచ్‌ సునీల్‌కుమార్‌

వాల్మీకిపురం, జూన్‌ 29: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏపీఎల్‌ (ఆంధ్ర ప్రీమియం లీగ్‌) క్రికెట్‌ పోటీలకు వాల్మీకిపురం సబ్‌ సెంటర్‌ నుంచి మీడియం పేసర్‌ వి.శ్రీకాంత్‌ ఎంపికైనట్లు కోచ్‌ జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. ఏసీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏపీఎల్‌లో 23 జిల్లాల నుంచి 6 జట్లు పాల్గొంటుండగా రాయలసీమ కింగ్స్‌ జట్టుకు వి.శ్రీకాంత్‌ను తీసుకున్నట్లు తెలిపారు. శ్రీకాంత్‌ చిత్తూరు జిల్లా అండర్‌-16, 19, 23, సీనియర్‌ జట్టు సభ్యుడిగా జిల్లాకు ఆడారు. ఎస్వీ యూనివర్సిటీ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. జూలై 6వ నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే ఆంధ్రా క్రికెట్‌ లీగ్‌ (ఏపీఎల్‌) పోటీలలో శ్రీకాంత్‌ పాల్గొంటారు. శ్రీకాంత్‌ ఎంపిక పట్ల జిల్లా అసోసియేషన్‌ సెక్రటరీ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ చిన్ని, అసోసియేషన్‌ సభ్యులు వీసీసీ, జీవీఎ్‌ససీఎస్‌ సభ్యులు జి.శ్రీధర్‌కుమార్‌, రాకేష్‌, షాహెద్‌, మాజీ రంజీ క్రీడాకారుడు రాకేష్‌, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-06-30T05:10:21+05:30 IST