శ్రీకాళహస్తీశ్వర ఆలయం క్యూలైన్లలో గుంపులుగా భక్తులు

ABN , First Publish Date - 2020-09-21T20:39:53+05:30 IST

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కోవిడ్ నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయం క్యూలైన్లలో గుంపులుగా భక్తులు

తిరుపతి: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కోవిడ్ నిబంధనలను  పూర్తిగా గాలికి వదిలేశారు. ఓ వైపు కరోనా విజృంభిస్తున్నా.. భౌతిక దూరాన్ని విస్మరించారు. కొందరు అయితే మాస్కులు ధరించలేదు. అధికారులు పర్యవేక్షణ లోపంతో క్యూలైన్లలో భక్తులు ఒకరినొకరు ఆనుకుని బారులు తీరారు. ఆలయ రెండవ గేట్ శివయ్య గోపుర ద్వారం వద్ద రద్దీ కనిపించింది. పైగా చాలా మంది మాస్కులు కూడా ధరించకుండా కనిపించారు.


శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆలయంలో కూడా పలువురు ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. ఈ పరిస్థితిలో ఆయాలనికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నా.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు చేతులెత్తేయడం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కోవిడ్ నిబంధలను సమర్థవంతంగా అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2020-09-21T20:39:53+05:30 IST