శివరాత్రికి ముస్తాబవుతున్న ముక్కంటి క్షేత్రం

ABN , First Publish Date - 2021-02-26T06:03:31+05:30 IST

మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముక్కంటి క్షేత్రం ముస్తాబవు తోంది.

శివరాత్రికి ముస్తాబవుతున్న ముక్కంటి క్షేత్రం
మహద్వారం ముందు ధ్వజస్తంభం వద్ద రంగులు వేస్తున్న దృశ్యం

 శ్రీకాళహస్తి, ఫిబ్రవరి25: మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముక్కంటి క్షేత్రం ముస్తాబవు తోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మార్చి 6నుంచి 19వ తేదీ వరకు  మహాశివరాత్రి వార్షిక బ్రహ్మో త్సవాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఉత్సవాలు సమీపిస్తుండటంతో ఆలయంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆలయంలో  ఇప్పటికే విద్యుత్‌ దీపాలంకరణ పూర్తయింది. అదేవిధంగా స్వామి, అమ్మవార్ల సేవలకు వినియోగించే వాహనాలకు రంగులు వేయడం పూర్తయింది. ఆలయం లోపల, ప్రాంగణంలో రంగవళ్లులు వేస్తున్నారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, ప్రత్యేక సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ధూర్జటి కళా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు. భక్తకన్నప్ప ధ్వజారోహణం కోసం ఆ ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.  ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ఇన్‌ఛార్జి ఈఈ వెంకటనారాయణ, డీఈ మురళీధర్‌ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.





Updated Date - 2021-02-26T06:03:31+05:30 IST