చిత్తూరు: అమరావతి రాజధాని కోసం రైతుల చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం శ్రీకాళహస్తి నుంచి రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులు శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం మహిళా రైతులకు శ్రీకాళహస్తి మహిళలు పాదపూజ చేశారు. రైతుల పాదాలు కడిగి పసుపు రాసి పూలుచల్లారు. మధ్యాహ్నం పాదయాత్రకు రైతులు విరామం ప్రకటించనున్నారు. అలాగే రేపు కూడా పాదయాత్రకు విరామం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.