శ్రీకాళహస్తి: నగరంలో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వద్దని కోర్టు చెప్పినా దాన్ని పట్టించుకోకుండా పట్టణంలోని చెట్లు, పుట్టలు, స్తంభాలు.. ఇలా కనిపించిన ప్రతి దానికి వైసీపీ రంగులు అద్దీ ఆనందిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కాలనీ వద్ద జగనన్న కాలనీలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తన గురుభక్తిని చాటుకుంటూ సీఎం జగన్ పేరిట నవరత్నాల నిలయాన్ని నిర్మించారు. వారం రోజుల క్రితం ఈ నిలయాన్ని ప్రారంభించారు. తర్వాత రెండు రోజులకు ఈ నిలయంలోని అద్దాల మహల్‌ను ప్రారంభించారు. ఈ రెండు కార్యక్రమాలను పురష్కరించుకుని వైసీపీ నేతలు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం నుంచి రాజీవ్ నగర్ కాలనీ వరకు వైసీపీ రంగులతో హల్ చల్ చేశారు.