శ్రీకాకుళం: జిల్లాలోని హీరా మండలంలో జరుగుతున్న కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 89 ఓట్లతో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి బుచ్చిబాబు గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. అయితే వైసీపీ ఒత్తిడితో రీకౌంటింగ్‌కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రీకౌంటింగ్ కుదరదంటూ టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. అధికారుల తీరుకు నిరసనగా కౌంటింగ్ కేంద్రం దగ్గర టీడీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. కౌంటింగ్ కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు.