22,85,054

ABN , First Publish Date - 2021-01-16T05:56:07+05:30 IST

జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఓటర్ల తుది జాబితాను శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ నివాస్‌ విడుదల చేశారు. జిల్లాలో పది నియోజకవర్గాల్లో 22,85,054మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించారు. ఇందులో పురుషులు 11,31,152 మంది, మహిళలు 11,36,558 మంది ఉన్నారు. థర్డ్‌ జండర్స్‌ ఓట్ల సంఖ్య 269, అలాగే సాయుధ దళాలకు సంబంధించి సర్వీసు ఓట్లు 17,075 ఉన్నాయి. ఇందులో 16,581 మంది పురుషులు, 494 మహిళలు ఉన్నారు.

22,85,054

ఇదీ జిల్లా ఓటర్ల సంఖ్య

తుది జాబితా విడుదల

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 15: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఓటర్ల తుది జాబితాను శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ నివాస్‌ విడుదల చేశారు. జిల్లాలో పది నియోజకవర్గాల్లో 22,85,054మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించారు. ఇందులో పురుషులు 11,31,152 మంది, మహిళలు 11,36,558 మంది ఉన్నారు. థర్డ్‌ జండర్స్‌ ఓట్ల సంఖ్య 269, అలాగే సాయుధ దళాలకు సంబంధించి సర్వీసు ఓట్లు 17,075 ఉన్నాయి. ఇందులో 16,581 మంది పురుషులు, 494 మహిళలు ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎక్కువమంది ఓటర్లు ఉన్నారు. పాలకొండ, ఇచ్ఛాపురం, పలాస, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు కంటే.. మహిళలు అధికం. రాజాం, నరసన్నపేట, ఎచ్చెర్ల, పాతపట్నం, టెక్కలి నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల కంటే  పురుషులు అధికంగా ఉన్నారు.



జిల్లా ఓటర్లు ఇలా.. 

------------------

నియోజకవర్గం మొత్తం ఓటర్లు  పురుషులు మహిళలు  థర్డ్‌ జండర్స్‌ సర్వీస్‌ ఓటర్లు 

--------------------------------------------------------------------------------------------- 

ఇచ్ఛాపురం 2,60,018 1,26,671 1,31,480 15 1,852

పలాస 2,16,031 1,05,089 1,07,998 21 2,923

టెక్కలి 2,35,642 1,16,919 1,15,844 47 2,832

పాతపట్నం 2,27,600 1,13,220 1,12,562 18 1,800

శ్రీకాకుళం 2,65,915 1,31,568 1,33,099 43 1,205

ఆమదాలవలస 1,97,432 97,559 97,726 44 2,103

ఎచ్చెర్ల 2,39,247 1,20,676 1,17,688 20 863

నరసన్నపేట 2,17,139 1,07,524 1,07,438 18 2,159

రాజాం 2,28,239 1,14,981 1,12,475 29 754

పాలకొండ 1,97,786 96,945 1,00,248 9 584

----------------------------------------------------------------------------------------

 మొత్తం :  22,85,054 11,31,152 11,36,558 269 17,075

-----------------------------------------------------------------------


Updated Date - 2021-01-16T05:56:07+05:30 IST