శ్రీకాకుళంలో చిచ్చు రేపిన కొత్త జిల్లాల విభజన

ABN , First Publish Date - 2022-02-14T20:54:51+05:30 IST

శ్రీకాకుళం: జిల్లాల పునర్ విభజన నిర్ణయంపై శ్రీకాకుళం ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి.

శ్రీకాకుళంలో చిచ్చు రేపిన కొత్త జిల్లాల విభజన

శ్రీకాకుళం: జిల్లాల పునర్ విభజన నిర్ణయంపై శ్రీకాకుళం ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి. పునర్ విభజనలో భాగంగా జిల్లాలోని ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం పాలకొండ.. పార్వతీపురం కేంద్రంగా ఏర్పడనున్న మన్యం జిల్లాలో చేరనుంది. సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలో చేర్చితే తమ పరిస్థితి ఏంటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.


ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటుకు అధికారులు రోడ్ మ్యాప్‌కు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట కేంద్రంగా ఐటీడీఏ కొనసాగుతోంది. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటు కావడం.. పాలకొండ నియోజకవర్గాన్ని విలీనం చేస్తుండడంతో సీతంపేట ఐటీడీఏ కొనసాగింపుపై సందేహాలు నెలకొన్నాయి.

Updated Date - 2022-02-14T20:54:51+05:30 IST