Abn logo
Sep 28 2021 @ 10:21AM

నాగావళి నది ఉగ్రరూపం

శ్రీకాకుళం: జిల్లాలో నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. మడ్డువలస వద్ద 55వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు విడుదల చేశారు. బూర్జ, ఆమదాలవలస మండలాల్లోని గ్రామాల్లోకి వరద నీరు చేరింది. నిమ్మతుర్లాడలో జగనన్న కాలనీ, సచివాలయం నీట మునిగాయి. బూర్జ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నికిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

క్రైమ్ మరిన్ని...