Abn logo
Jul 16 2021 @ 11:24AM

Crime: బీర్ సీసాలతో దాడి చేసి.. మహిళపై యువకుల దారుణం..

శ్రీకాకుళం: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకులు మతిస్థిమితంలేని ఓ మహిళపై అత్యాచారయత్నం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో బీర్ సీసాలతో దాడి చేశారు. ఈ ఘటన రాజాం మండలం, పెనుబాకలో చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


గ్రామానికి చెందిన ఓ యువకుడి పుట్టిన రోజు వేడుకలు గ్రామ సమీపంలోని పొలాల్లో చేసుకున్నారు. ఈ కార్యక్రామానికి 15మంది యువకులు హాజరయ్యారు. అనంతరం బస్ షెల్టర్‌లో తలదాచుకుంటున్న, మతిస్థిమితం లేని మహిళపై అఘాయిత్యానికి యత్నించారు. ప్రతిఘటించిన మహిళపై యువకులు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు అధికారపార్టీ మద్దతుదారులు కావడంతో స్థానిక నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అసలు వ్యక్తులను వదిలి వారి స్థానంలో వేరే వ్యక్తులను నిందితులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.