సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న డిప్యూటి సిఎం

ABN , First Publish Date - 2021-04-11T15:37:50+05:30 IST

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం కృష్ణదాసు అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.

సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న డిప్యూటి సిఎం

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం కృష్ణదాసు అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈఓ, ప్రధాన అర్చకులు... ఆలయ సాంప్రదాయాలతో ఆయనకు స్వాగతం పలికి.. దగ్గరుండి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశంలోని అతి పెద్ద సుప్రసిద్ధ సూర్యదేవాలయాల్లో ఒకటిగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటారు.

Updated Date - 2021-04-11T15:37:50+05:30 IST