Srikakulam: తల్లీకూతుళ్లపై ఇనుపరాడ్లతో దాడి

ABN , First Publish Date - 2022-02-15T15:13:13+05:30 IST

జిల్లాలోని టెక్కలి మండలం పాతనౌపడలో దారుణం జరిగింది. తల్లీకూతుళ్లపై ఇనుప రాడ్లతో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.

Srikakulam: తల్లీకూతుళ్లపై ఇనుపరాడ్లతో దాడి

శ్రీకాకుళం: జిల్లాలోని టెక్కలి మండలం పాతనౌపడలో దారుణం జరిగింది. తల్లీకూతుళ్లపై ఇనుప రాడ్లతో  గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో జెండాపేట గ్రామానికి చెందిన తిప్పన యమున, తల్లి జగదాంబ తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కోసం వేచిఉన్న సమయంలో దాడి జరిగింది. తల్లీకూతుళ్ల వద్ద నుంచి మొబైల్స్, హ్యాండ్ బ్యాగ్‌ను దుండగులు ఎత్తుకుపోయారు. ప్రస్తుతం తల్లీకూతుళ్లు టెక్కలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-15T15:13:13+05:30 IST