AP News: శ్రీకాకుళంలో కిడ్నాప్ కలకలం

ABN , First Publish Date - 2022-08-10T16:12:01+05:30 IST

పట్టణంలో ప్రముఖ వైద్యుడు గూడాన సోమేశ్వరరావు కిడ్నాప్ కలకలం రేగింది.

AP News: శ్రీకాకుళంలో కిడ్నాప్ కలకలం

శ్రీకాకుళం: పట్టణంలో  ప్రముఖ వైద్యుడు గూడాన సోమేశ్వరరావు కిడ్నాప్ కలకలం రేగింది. సోమేశ్వరరావును కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించగా... డాక్టర్ ప్రతిఘటించారు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకోవడంతో ఇద్దరు కిడ్నాపర్లలో ఒకరు పారిపోగా... మరొకరిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-08-10T16:12:01+05:30 IST