Abn logo
Oct 17 2020 @ 13:57PM

మంత్రి కృష్ణదాసు వ్యాఖ్యలపై వ్యవసాయ కార్మిక సంఘం ఆగ్రహం

శ్రీకాకుళం: మంత్రి కృష్ణదాస్‌‌పై వ్యవసాయ కార్మిక సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ కూలీలపై జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో మంత్రి కృష్ణదాసు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం నిరసనకు దిగింది. ఉపాధి హామీ పథకం వ్యవసాయ రంగానికి పెనుముప్పుగా మారిందని కృష్ణదాసు  వ్యవసాయ సలహామండలి సమావేశంలో వ్యాఖ్యానించారు. ఉపాధిహామీకి వెళ్లి 2, 3 గంటలు కాలక్షేపం చేస్తే సరిపోతుందని... వ్యవసాయ పనులకు వెళ్తే 6 గంటలు కష్టపడాలని డిప్యూటీ సీఎం అన్నారు. దీంతో కృష్ణదాసు వ్యాఖ్యలపై వ్యవసాయ కార్మిక సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసనకు దిగిన నేతలను అరెస్ట్ చేశారు. 

Advertisement
Advertisement